Nalgonda: కేతేపల్లిలో ప్రేమ పేరుతో దారుణం.. మైనర్ బాలికపై హత్యాయత్నానికి పాల్పడ్డ ఉన్మాది

నల్గొండ జిల్లా కేతేపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో మైనర్ బాలికపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ ఉన్మాది.

Arun Chilukuri
Published on: 17 Oct 2025 11:47 AM IST
Nalgonda: కేతేపల్లిలో ప్రేమ పేరుతో దారుణం.. మైనర్ బాలికపై హత్యాయత్నానికి పాల్పడ్డ ఉన్మాది
X

Nalgonda: కేతేపల్లిలో ప్రేమ పేరుతో దారుణం.. మైనర్ బాలికపై హత్యాయత్నానికి పాల్పడ్డ ఉన్మాది

Nalgonda: నల్గొండ జిల్లా కేతేపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో మైనర్ బాలికపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ ఉన్మాది. బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించి ప్రేమించమంటూ బెదిరించాడు. బాలిక భయపడి గట్టిగా అరవడంతో..ఆమెపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఘటనలో బాలికకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story