తెలంగాణ బీజేపీకి షాక్‌.. త్వరలో హస్తం గూటికి జిట్టా

TS BJP: టికెట్‌ హామీ వస్తే కండువా మార్చుకోవడానికి సిద్ధమవుతున్న కమలనాథులు

Shekhar G
Published on: 26 July 2023 6:49 PM IST
Shock For Telangana BJP
X

తెలంగాణ బీజేపీకి షాక్‌.. త్వరలో హస్తం గూటికి జిట్టా

TS BJP: తెలంగాణ బీజేపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. టికెట్‌ హామీ వస్తే కండువా మార్చుకోవడానికి కమలనాథులు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే జిట్టా బాలకృష్ణారెడ్డితో కాంగ్రెస్‌ నేతలు మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. త్వరలో హస్తం గూటికి జిట్టా వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ మార్పుపై ఈ నెల 29న అమిత్‌షాకు జిట్టా లేఖ రాయనున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. జిట్టాతో పాటు మాజీమంత్రి చంద్రశేఖర్‌, మాజీ ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్‌ కూడా కాంగ్రెస్‌లో చేరే ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. వీరితో పాటు.. మరో 10 మంది బీజేపీ నేతలు.. హస్తం పార్టీ నేతలతో టచ్‌లో ఉన్నట్టు సమాచారం. దీంతో బీజేపీ నుంచి వచ్చేవారితో హస్తం నేతలు వరుసగా చర్చలు జరుపుతున్నారు.

Shekhar G

Shekhar G

Next Story