Chevella: చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు షాక్

Chevella: కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్న కార్పొరేటర్లు

Shashank Gullapelli
Published on: 30 April 2024 1:54 PM IST
Shock for Congress and BRS in Chevella Constituency
X

Chevella: చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు షాక్ 

Chevella: సార్వత్రిక ఎన్నికల ముందు చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు భారీ షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజక వర్గం పరిధిలోని మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎనిమిది మంది కార్పొరేటర్లు భారతీయ జనతా పార్టీలో చేరారు. చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అందెల శ్రీరాములు కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీలో చేరిన వారిలో రవినాయక్, విజయలక్ష్మీ రాజు, జ్యోతి కిషోర్, గౌరి శంకర్, వేముల నర్సింహ, మల్లేష్ ముదిరాజు, అరుణా ప్రభాకర్ రెడ్డి, కో ఆప్షన్ మెంబర్ ఎల్లమ్మ ఉన్నారు.

బీజేపీ విజన్, మోడీ నాయకత్వానికి ఆకర్షితులై ఎందో మంది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరుతున్నారని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో మీర్ పేటలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని.. కొత్త పాలకవర్గం ఏర్పాట కాగానే కేంద్రం నుంచి వచ్చే నిధులతో అభివృద్ధి చేసుకుందామని విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story