Peddapally: బీఆర్‌ఎస్‌ పార్టీకి షాక్.. మంథని ఎంపీపీ, నలుగురు ఎంపీటీసీలు రాజీనామా

Peddapally: కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన శ్రీధర్‌బాబు

Shekhar G
Published on: 16 Oct 2023 12:53 PM IST
Shock For BRS Party In Manthani Of Peddapalli District
X

Peddapally: బీఆర్‌ఎస్‌ పార్టీకి షాక్.. మంథని ఎంపీపీ, నలుగురు ఎంపీటీసీలు రాజీనామా 

Peddapally: పెద్దపల్లి జిల్లా మంథనిలో బీఆర్‌ఎస్‌ పార్టీకి షాక్ తగిలింది. మంథని ఎంపీపీతో పాటు నలుగురు ఎంపీటీసీలు బీఆర్‌ఎస్‌ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంథని ఎంపీపీ కొండా శంకర్, వైస్ ఎంపీపీ స్వరూప్‌తో పాటు మరో ఉప్పట్ల ఎంపీటీసీ బడికెల లింగయ్య, ఎక్లాస్ పూర్ ఎంపీటీసీ ప్రభాకర్ రెడ్డి, చిల్లపల్లి ఎంపీటీసీ గుమ్మడి రాజయ్య, పోతారం సర్పంచ్ జాగిరి స్వప్న సదానందం బీఆర్ఎస్ పార్టీని వీడారు. హైదరాబాద్ గాంధీభవన్‎‌లో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Shekhar G

Shekhar G

Next Story