Nizamabad: నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్‌కు షాక్

Nizamabad: ఇవాళ డీసీసీబీ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం

Shashank Gullapelli
Published on: 21 March 2024 10:03 AM IST
Shock For BRS In Nizamabad District
X

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్‌కు షాక్

Nizamabad: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకారబ్యాంక్ చైర్మన్‌పై డైరెక్టర్లు తిరుగుబాటు ప్రకటించారు. ఈనెల 4వ తేదీన డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మాం నోటీసులు అంద చేశారు. డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో డ16 మంది డైరెక్టర్లు క్యాంపునకు తరలి వెళ్లి 15 రోజుల తర్వాత తిరిగి వచ్చారు. ఇవాళ ఉదయం 11 గంటలకు అవిశ్వాసంపై సమావేశం జరగనున్నది. మరో వైపు డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. అవిశ్వాస తీర్మానంపై వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టి వేసింది. దీంతో పోచారం భాస్కర్ రెడ్డి పదవి కోల్పోవడం ఖాయం అయ్యింది. రాజీనామా లేఖను డీసీఓకు పంపించారు డీసీసీబీ చైర్మన్.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story