మియాపూర్ ప్రేమోన్మాది దాడి ఘటనలో యువతి త్లలి మృతి

* వైభవి, శోభపై కత్తితో దాడి చేసిన సందీప్.. తీవ్రగాయాలతో చికిత్సపొందుతున్న కూతురు వైభవి

R Tripura Malini
Published on: 14 Dec 2022 10:18 AM IST
Shobha Died While Being Treated At Gandhi Hospital
X

మియాపూర్ ప్రేమోన్మాది దాడి ఘటనలో యువతి త్లలి మృతి

Hyderabad: హైదరాబాద్ మియాపూర్‌లో ప్రేమోన్మాది దాడిలో బాధితురాలి తల్లి మృతిచెందింది. నిన్న ఆదిత్యనగర్‌లో తల్లీకూతుళ్లపై రేపల్లెకు చెందిన సందీప్ కత్తితో దాడి చేశాడు. హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తున్న క్రమంలో యువతి తల్లి శోభ మృతిచెందింది. మరోవైపు యువతికి గాంధీలోనే చికిత్స కొనసాగుతోంది. నిందితుడు సందీప్‌కు కోటీ ENT ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. నిందితుడు కోలుకున్న అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. ఇప్పటికే బాధితుల నుంచి పోలీసులు స్టేట్‌మెంట్ రికార్డ్ పూర్తి చేశారు. ఈక్రమంలో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి తల్లి శోభ మృతిచెందింది.

R Tripura Malini

R Tripura Malini

Next Story