Mekala Shirisha: 11 మంది కౌన్సిలర్లు నాపై అవిశ్వాసం ప్రవేశపెట్టారు.. కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నా

Mekala Shirisha: తనపై అవిశ్వాసాన్ని హైకోర్టులో సవాల్ చేశానన్న శిరీష

Shekhar G
Published on: 24 Jan 2024 2:28 PM IST
Shirisha Challenged The No Confidence In The High Court
X

Mekala Shirisha: 11 మంది కౌన్సిలర్లు నాపై అవిశ్వాసం ప్రవేశపెట్టారు.. కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నా

Mekala Shirisha: తనపై పెట్టిన అవిశ్వాసం తీర్మానాన్ని సవాల్ చేశానన్నారు నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపల్ ఛైర్‌పర్సన్ మేకల శిరీష. తనకు వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టిన 11 మంది కౌన్సిలర్లపై కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. కుట్రపూరితంగానే తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని ఆరోపించారు. అవి‌శ్వాసంపై తాను హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. అవిశ్వాసంపై స్టే తీసుకొచ్చుకున్నట్లు ఛైర్‌పర్సన్ శిరీష తెలిపారు. అధికార పార్టీ అండదండలతో జిల్లా అధికారులు తనకు న్యాయం చేయడంలేదని ఆరోపించారు శిరీష.

అయితే శిరీషపై అవిశ్వాసం విషయంలో తమకు అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు అందలేదన్నారు ఆర్డీవో రామచందర్. 11 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు శిరీషకు వ్యతిరేకంగా అవిశ్వాసం తీర్మానం పెట్టారని అన్నారు. అవిశ్వాసం పెట్టిన కౌన్సిలర్ల నుంచి సంతకాలు సేకరించామన్నారు. కోర్టు ఆదేశాలు అందిన వెంటనే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు ఆర్డీవో.

Shekhar G

Shekhar G

Next Story