ఆసియా పసిఫిక్‌ గ్రీన్‌ ఎయిర్‌పోర్టు అవార్డు గెలుచుకున్న శంషాబాద్‌ విమానాశ్రయం

ఆసియా పసిఫిక్‌ గ్రీన్‌ ఎయిర్‌పోర్టు అవార్డు గెలుచుకున్న శంషాబాద్‌ విమానాశ్రయం
x
Highlights

ఇప్పటి వరకు ఎన్నోపురస్కారాలను సొంతం చేసుకున్న రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి(ఆర్‌జీఐఏ) మరో అంతర్జాతీయ పురస్కారం లభించింది.

ఇప్పటి వరకు ఎన్నోపురస్కారాలను సొంతం చేసుకున్న రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి(ఆర్‌జీఐఏ) మరో అంతర్జాతీయ పురస్కారం లభించింది. 15 నుంచి 35 మిలియన్‌ ప్రయాణికుల సామర్థ్యం కలిగిన విమానాశ్రయాల్లో ఆర్‌జీఐఏ ప్రతి ఏటా పర్యావరణహితమైన చర్యలు తీసుకుకుంటుంది. ఇందులో భాగంగానే 2020 సంవత్సరానికి గాను ఆసియా విభాగంలో పసిఫిక్‌ గ్రీన్‌ ఎయిర్‌పోర్టు ప్లాటినం పురస్కారాన్ని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దక్కించుకుంది.

అంతర్జాతీయ విమానాశ్రయ మండలి ఆ పురస్కారాన్ని ఆర్‌జీఐఏకు అందజేసింది. ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్ సీఈఓ ఎస్‌జీకే కిశోర్‌ మాట్లాడుతూ నీటి వినియోగాన్ని తగ్గించడం, నీటిని రీసైక్లింగ్‌ ద్వారా వాడుకోవడం, నీటిని ఒడిసిపట్టేందుకు ప్రత్యేక చర్యలను శంషాబాద్‌ విమానాశ్రయంలో తీసుకుంటున్నారని తెలిపారు. అంతే కాక ఆరు లక్షల క్యూబిక్‌ మీటర్ల నీటిని నిల్వ చేసే రిజర్వాయర్‌ను ఆటోమేటిక్‌ డ్రిప్‌ సిస్టం ద్వారా ఏర్పాటు చేశారు. ఈ నీటి నిర్వహణను ఏసీఐ ఆధ్వర్యంలో గ్రీన్‌ ఎయిర్‌పోర్టు కమిటీ గుర్తించడం హర్షణీయమని ఎయిర్‌ పోర్టు వర్గాలు పేర్కొన్నాయి. ఆర్‌జీఐఏలో తీసుకుంటున్న పర్యావరణ హితమైన చర్యలు బాగున్నాయని ఏసీఐ డైరెక్టర్‌ స్టెఫానో బారోన్కీ పేర్కొన్నట్లు తెలిపారు. ఇందుకోసం విమానాశ్రయంలో 925 కేఎల్‌డీ సామర్థ్యం కలిగిన ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశారు.

ఇక పోతే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్ నగరానికి సుమారు 22 కి.మీ దూరంలో శంషాబాద్ లో ఉంది. ఈ విమానాశ్రయం ద్వారా వాణిజ్య సేవలను మార్చి 23, 2008 నుండి ప్రారంభించారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలో కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత పబ్లిక్-ప్రైవేట్ ఉమ్మడి నిర్వహణలో నడుపబడుతున్న రెండవ విమానాశ్రయం. 2010-11 లో భారత దేశ విమానాశ్రయాలలో అతి రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఆరవదిగా నిలిచింది. ఈ విమానాశ్రయం 2013 లో స్కైట్రాక్స్ ద్వారా ప్రపంచ విమానాశ్రయాలలో అధిక విశేష లక్షణాలున్న విమానాశ్రయంగా అగ్రభాగాన నిలిచింది. ఇది స్పెషల్ జెట్, సుఫ్తాంసా కాంగో, బ్లూడార్ట్ ఏవియేషన్ లకు కూడా తన సేవలందిస్తుంది.

పబ్లిక్, ప్రైవేట్ ఉమ్మడి యాజమాన్యంతొ నడుపుతున్న ఈ విమానాశ్రయాన్ని 2005 లో డిజైన్, నిర్మానం ప్రారంభించబడింది. ఈ విమానాశ్రయం మార్చి 2008 లో ప్రారంభించారు. ఈ విమానాశ్రయం జి.ఎం.ఆర్ గ్రూపు, మలేసియా ఎయిర్పోర్ట్స్ వంటి ప్రైవేట్ యాజమాన్యాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వంటి పబ్లిక్ సంస్థలతొ పాటు నిర్వహింపబడుతున్నది. ఈ విమానాశ్రయంలో జి.ఎం.ఆర్ గ్రూపు 63%, తెలంగాణ ప్రభుత్వం, ఎయిర్ పోర్ట్స్ ఆఫ్ ఇండియాలకు 13% వాటాలున్నాయి.

ఈ విమానాశ్రయాన్ని 5500 ఎకరాల విస్టీర్ణంలో మూడు దశలలో పూర్తి చేసారు. ఈ విమాశ్రాయానికి డిజైన్ను యు.కె ఇంజనీరింగ్ దిజైన్ సంస్థ అయిన "అరూప్ గ్రూప్ లిమిటెడ్" అందించారు. ఇది పూర్తయ్యేనాటికి ఒక యేడాదికి 40 మిలియన్ల ప్రయాణీకులకు సేవలందించే విధంగా మౌలిక సదుపాయాలు కల్పించారు.

మొదటి దశ:

మొదటి దశలో 1,05,000 చదరపు మీటర్ల ఎయిర్ పోర్టు టెర్మినల్ 1 అభివృద్ధి చేసారు. దీని సామర్థ్యం సంవత్సరానికి 14 మిలియన్ల ప్రయాణీకులను సేవలందించే విధంగా నిర్మించబడింది. ఈ టెర్మినల్ 10 కంటాక్ట్ , 36 రిమోట్ స్టాండ్లతో కూటుకుని ఉంది. ఇతర భవనాలు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, టెక్నికల్ భవనం, కార్గో హాంగర్స్ , నిర్వహణా హాంగర్స్, 49500 చదరపు మీటర్ల స్థలంలో వినియోగాలు మొదలైనవి నిర్మించబడినవి. 1800 కార్ పార్కిక్ స్థలం టెర్మిన 1 కు ముందు వైపున ప్రయాణీకులకు, సందర్శకుల సౌకర్థార్థం నిర్మించబడింది.

రెండో దశ:

రెండో దశలో విమానాశ్రయ అభివృద్ధిలో భాగంగా టెర్మినల్ 1 ను విస్తరించారు. పెరిగిన డిమాండును అనుసరించి 2,60,000 చదరపు మీటర్ల పరిధిలోకి విస్తరించారు. తరువాత విమానాలను పార్కింగ్ చేయడానికి 30 స్టాండులు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ టెర్మినల్ ను ప్రతి సంవత్సరం 18మిలియన్ల ప్రయాణీకులకు సేవలందించే విధంగా విస్తరించారు.

చివరి దశ:

ఈ విమానాశ్రయం పూర్తి స్థాయిలో చివరి దశలో అభివృద్ధి చెందినది. ఈ దశలో నిర్మాణాల స్థలం 9,00,000 చదరపు మీటర్లలో 4,20,000 చదరపు మీటర్లు విస్తీర్ణం అధికంగా అభివృద్ధి చేశారు. అంతిమ లక్ష్యంగా సంవత్సరానికి 40 మిలియన్ల ప్రయాణీకులకు సేవలందించే విధంగా తయారు చేశారు.

పురస్కారాలు:

♦ 2009 సంవత్సరంలో సెంట ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ పురస్కారాన్ని బెస్ట్ ఎయిర్ పోర్ట్ ఎన్విరాన్‌మెంటల్ పెరపార్మెన్స్ ఆఫ్ ది యియర్ విభాగంలో గెలుపొందింది.

♦ 2010 ఎయిర్‌పోర్టు కౌన్సిల్ ఇంటర్నేషనల్ ద్వారా ఎయిర్ పోర్టు సర్వీసు క్వాలిటీ పురస్కారాన్ని ఉత్తమ విమానాశ్రమ పరిమాణం విభాగంలో గెలుపొందింది.

♦ 2011 ఎయిర్‌పోర్టు కౌన్సిల్ ఇంటర్నేషనల్ ద్వారా ఎయిర్ పోర్టు సర్వీసు క్వాలిటీ పురస్కారాన్ని

♦ ఉత్తమ విమానాశ్రమ పరిమాణం విభాగంలో గెలుపొందింది.

♦ 2012 స్కై ట్రాక్స్ ద్వారా వరల్డ్ ఎయిర్ పోర్టు పురస్కారాలన్ని భారతదేశ ఉత్తమ విమానాశ్రయం విభాగంలో గెలుపొందింది.

♦ 2013 స్కై ట్రాక్స్ ద్వారా వరల్డ్ ఎయిర్ పోర్టు పురస్కారాన్ని భారతదేశ ఉత్తమ విమానాశ్రయం విభాగంలో గెలుపొందింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories