Shaikpet Ex MRO Sujatha: షేక్‌పేట్ మాజీ ఎమ్మార్వో సుజాత మృతి

Shaikpet Ex MRO Sujatha: గుండెపోటుతో చనిపోయిన సుజాత

Jyothi
Published on: 3 Sept 2022 12:02 PM IST
Shaikpet Ex MRO Sujatha Lost Life Due to Heart Attack
X

Shaikpet Ex MRO Sujatha: షేక్‌పేట్ మాజీ ఎమ్మార్వో సుజాత మృతి

Shaikpet Ex MRO Sujatha: షేక్‌పేట మాజీ ఎమ్మార్వో సుజాత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో నిమ్స్‌ ఆసుపత్రిలో చేరిన సుజాత శనివారం ప్రాణాలు విడిచారు. సుజాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో గతంలో సుజాత ఇంటిపై దాడి చేసిన ఏసీబీ అధికారులు.. ఆమెను అరెస్ట్‌ చేశారు.

ఏసీబీ దాడుల అనంతరం ఏడాది క్రితమే సుజాత భర్త ఆత్మహత్య పాల్పడ్డాడు. అప్పటి నుంచి తీవ్రమైన మానసిక క్షోభతో బాధపడుతున్న సుజాతకు మళ్లీ విధుల్లోకి చేరేందుకు అవకాశం ఇచ్చినా ఆమె తిరస్కరించారు. ఈ క్రమంలోనే డిప్రెషన్‌లోకి వెళ్లిన సుజాత.. ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తొలుత ప్రచారం జరిగింది. అయితే తాజాగాకు ఆమె గుండెపోటుతో మృతిచెందినట్టుగా తెలుస్తోంది.


Jyothi

Jyothi

Next Story