హైదరాబాద్‌ అబ్దుల్లాపూర్‌ మెట్‌లో విద్యార్థి సంఘాల నాయకుల ఆందోళన

హైదరాబాద్‌ అబ్దుల్లాపూర్‌ మెట్‌లో విద్యార్థి సంఘాల నాయకుల ఆందోళన
x
Highlights

హైదరాబాద్‌ అబ్దుల్లాపూర్‌ మెట్‌లో విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు.

హైదరాబాద్‌ అబ్దుల్లాపూర్‌ మెట్‌లో విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల జాప్యం కారణంగా.. ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ యూనియన్‌ బందు ప్రకటించింది. ఈ క్రమంలో బ్రిలియంట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ.. తరగతులు నిర్వహిస్తుండటంతో SFI నాయకులు ఆందోళన చేశారు. బంద్‌ ప్రకటించినా కళాశాల నడుపుతున్నారని.. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజు రియంబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories