Medak: మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. తడ్రీ కొడుకులు మృతి

Medak: తీవ్రంగా శ్రమించి మృతదేహాలను బయటకు తీసిన పోలీసులు

Shekhar G
Published on: 22 July 2023 1:49 PM IST
Serious Road Accident In Medak District
X

Medak: మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. తడ్రీ కొడుకులు మృతి

Medak: మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నార్సింగి మండలం వల్లూరు జాతీయ రహదారిపై కారు టైరు పగలడంతో డివైడర్‌ను దాటి లారీని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు నార్సింగ్ BRS మండల మాజీ అధ్యక్షుడు తౌర్యా నాయక్ అతని కుమారుడు అంకిత్‌గా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో కారు లారీలో ఇరుక్కుపోవడంతో మూడు గంటలు తీవ్రంగా శ్రమించి పోలీసులు మృతదేహాలను బయలకు తీశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

Shekhar G

Shekhar G

Next Story