హైదరాబాద్ శివారులో వరుస హత్యల కలకలం

X
Representational image
Highlights
* వ్యక్తిని హత్య చేసి సూట్‌కేసులో తెచ్చి ఉప్పర్‌పల్లి వద్ద వదిలివెళ్లిన దుండగులు * మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని పల్లెచెరువు వద్ద మరో హత్య
Sandeep Eggoju10 Jan 2021 6:19 AM GMT
హైదరాబాద్ శివారులో వరుస హత్యలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. రాజేంద్రనగర్‌లో డెడ్‌బాడీ కలకలం సృష్టించింది. డైరీఫామ్ దగ్గర సూట్‌కేసులో డెడ్‌బాడీని పోలీసులు గుర్తించారు. మృతుడు రియాజ్ చాంద్రాయణగుట్టకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇక ఈ కేసులో ముగ్గురు నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన మరువక ముందే మైలార్‌దేవ్‌పల్లి పీఎస్ పరిధి పల్లెచెరువు దగ్గర మరో హత్య కలకలం రేపింది. గుర్తుతెలియని ఓ వ్యక్తిని హత్య చేసి కవర్లో చుట్టి ఓ పాత ఆటోలో వదిలివెళ్లారు దుండగులు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఆధారాలను సేకరిస్తున్నారు. అయితే ఇది హత్యకాదని.. వృద్ధుడు మద్యం సేవించి ఆటోలో పడుకున్న తర్వాత చలికి మృతి చెంది ఉండవచ్చని చెబుతున్నారు పోలీసులు.
Web TitleSerial deaths in Hyderabad out scuts creating the sensation
Next Story