డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో సంచలన విషయాలు

* 100 మంది అనుచరులతో అటాక్ చేయించిన నవీన్ ‌రెడ్డి.. 40 మంది యువకులను గుర్తించిన రాచకొండ పోలీసులు

R Tripura Malini
Published on: 10 Dec 2022 12:15 PM IST
Sensational News In Dr Vaishali Kidnapping Case
X

డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో సంచలన విషయాలు

Kidnap: డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మన్నెగూడలో ఉన్నానని తండ్రి దామోదర్‌కు వైశాలి ఫోన్ చేశారు. దీంతో వైశాలి ఉన్న స్థలానికి తండ్రితో పాటు పోలీసులు బయలుదేరారు. కాగా ఈ కిడ్నాప్ ఘటనపై స్థానిక పోలీసులపై ఆరోపణలు వస్తున్నాయి. నవీన్‌రెడ్డితో వివాహం ఇష్టం లేక గతంలో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మెజిస్ట్రేట్ ఎదుట తనకు పెళ్లి ఇష్టం లేదన్న వైశాలి తెలిపింది. వేధింపులకు గురిచేస్తున్నాడంటూ నవీన్‌రెడ్డిపై ఆరోపించింది.

అయితే మరో వ్యక్తితో వివాహం చేస్తున్నారని కక్ష పెంచుకున్న నవీన్ రెడ్డి పెళ్లిచూపులున్నాయని తెలుసుకుని 100 మంది అనుచరులతో అటాక్ చేయించాడు. కిరాయి మనుషులు వైశాలి తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేశారు. కాగా సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. 40 మంది యువకులను రాచకొండ పోలీసులు గుర్తించారు. యువతిని కిడ్నాప్ చేసిన తర్వాత నవీన్‌రెడ్డికి అప్పగించి యువకులు పరారయ్యారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story