Top
logo

హైదరాబాద్ డ్రగ్స్ వ్యవహారంలో సంచలన నిజాలు!

హైదరాబాద్ డ్రగ్స్ వ్యవహారంలో సంచలన నిజాలు!
X
Highlights

హైదరాబాద్ డ్రగ్స్ వ్యవహారంలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. రసా‌యన శాస్త్రంలో పీహె‌చ్‌డీ చేసిన ఓ వ్యక్తి తన విజ్ఞా‌నాన్నిపక్కదారి పట్టిం‌చాడు. డ్రగ్స్‌ తయా‌రు‌చేసి యువ‌తను మత్తుకు బాని‌సను చేసేందుకు ప్రయ‌త్నిస్తూ డీ‌ఆ‌ర్‌ఐ అధి‌కా‌రు‌లకు చిక్కాడు.

హైదరాబాద్ డ్రగ్స్ వ్యవహారంలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. రసా‌యన శాస్త్రంలో పీహె‌చ్‌డీ చేసిన ఓ వ్యక్తి తన విజ్ఞా‌నాన్నిపక్కదారి పట్టిం‌చాడు. డ్రగ్స్‌ తయా‌రు‌చేసి యువ‌తను మత్తుకు బాని‌సను చేసేందుకు ప్రయ‌త్నిస్తూ డీ‌ఆ‌ర్‌ఐ అధి‌కా‌రు‌లకు చిక్కాడు. యువ‌తను మత్తులో ముంచ‌డం‌తో‌ పాటు మాన‌సిక వైక‌ల్యా‌నికి గురి‌ చే‌సే అత్యంత ప్రమా‌ద‌క‌ర‌మైన డ్రగ్‌ 'మె‌ఫె‌డ్రో‌న్‌'ను హైద‌రా‌బాద్‌ శివా‌రులో తయా‌రు‌ చే‌స్తు‌న్నట్టు అధి‌కా‌రులు గుర్తించారు. నిన్న దాదాపు దాదాపు నాలు‌గు‌చోట్ల దాడులు చేసి మొత్తం ఆరు‌గు‌రిని అరెస్ట్‌ చేశారు.

మరోవైపు డ్రగ్స్‌ తయారు చేస్తున్న ప్రధాన కేంద్రంలో 3.156 కిలోల మెఫె‌డ్రో‌న్‌ను సీజ్‌ చేశారు. దీని విలువ దాదాపు 63 లక్షలు ఉంటుందని అధి‌కా‌రులు చెప్పారు. దీంతో‌పాటు డ్రగ్‌ తయారు చేసేందుకు నిల్వ చేసిన 219.5 కిలోల ముడి పదా‌ర్థా‌లను అధికారులు స్వాధీనం చేసు‌కు‌న్నారు. వీటి సహాయంతో మరో 15–20 కిలోల మెఫె‌డ్రోన్‌ తయారు చేయ‌వ‌చ్చని అధి‌కా‌రులు చెబుతున్నారు.

Web TitleSensational facts about Hyderabad drugs
Next Story