Komatireddy VenkatReddy: నాలుగైదుసార్లు ఓడిపోయినవాళ్లతో కూర్చోవాలా ?

Komatireddy VenkatReddy: నాకిచ్చిన షోకాజ్‌ నోటీసులు ఎప్పుడో చెత్తబుట్టలో పడ్డాయి

Dhatripriya
Updated on: 12 Jan 2023 12:50 PM IST
Sensational Comments Of MP Komatireddy Venkat Reddy
X

Komatireddy VenkatReddy: నాలుగైదుసార్లు ఓడిపోయినవాళ్లతో కూర్చోవాలా ?

Komatireddy VenkatReddy: తెలంగాణ కాంగ్రెస్‌ నూతన ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావ్‌ థాక్రేతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకిచ్చిన షోకాజ్‌ నోటీసులు ఎప్పుడో చెత్తబుట్టలో పడ్డాయన్నారు. పీసీసీ కమిటీలను పట్టించుకోనన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నాలుగైదుసార్లు ఓడిపోయినవాళ్లతో కూర్చోవాలా అంటూ ఫైర్‌ అయ్యారు. నియోజకవర్గ పర్యటన వల్ల నిన్న థాక్రేను కలవలేదని అన్నారు. తమ ఫొటోలను మార్ఫింగ్‌ చేసిన విషయాన్ని ఏఐసీసీనే పట్టించుకోవడం లేదని, తన ఫొటో మార్ఫింగ్‌ అయిందని సీపీనే స్వయంగా చెప్పారని అన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

Dhatripriya

Dhatripriya

Next Story