Seethakka: ఇది సెక్రటేరియటా..? లేక రాజ భవనమా..?

Seethakka: అసెంబ్లీలోనూ మా గొంతు నొక్కుతున్నారు

Shekhar G
Published on: 6 Oct 2023 7:10 PM IST
Seethakka Fire On BRS Government
X

Seethakka: ఇది సెక్రటేరియటా..? లేక రాజ భవనమా..?

Seethakka: సెక్రటేరియట్‌లోకి తనను అనుమతించకపోవడంపై తీవ్రంగా మండిపడ్డారు ఎమ్మెల్యే సీతక్క. ఇది సెక్రటేరియటా..? లేక రాజ భవనమా..? అంటూ ఫైర్‌ అయ్యారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు సచివాలయానికి వస్తే అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నియంతృత్వంగా వ్యవహరిస్తోందో అర్థం కావడం లేదన్నారు. సచివాలయంలోకి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎందుకు అనుమతించడం లేదన్న ఎమ్మెల్యే సీతక్క.. ప్రతిపక్షాలు, ప్రశ్నించే గొంతుకలు సెక్రటేరియట్‌లోకి రాకూడదని బోర్డు పెట్టాలని సూచించారు. సచివాలయం బీఆర్‌ఎస్‌ వాళ్లకేనా అంటూ మండిపడ్డారు.

Shekhar G

Shekhar G

Next Story