Amit Shah Convoy: అమిత్‌ షా కాన్వాయ్‌కు అడ్డుగా వచ్చిన కారు.. అద్దాలు పగులగొట్టిన ఎస్పీజీ

Amit Shah Convoy: పరేడ్ గ్రౌండ్ సభ తర్వాత హరిత ప్లాజాకు బయల్దేరిన అమిత్ షా కాన్వాయ్‌కు ఓ కారు అడ్డొచ్చింది.

Arun Chilukuri
Published on: 17 Sept 2022 1:32 PM IST
Security Lapse in Amitshah Hyderabad Tour
X

Amit Shah Convoy: అమిత్‌ షా కాన్వాయ్‌కు అడ్డుగా వచ్చిన కారు.. అద్దాలు పగులగొట్టిన ఎస్పీజీ 

Amit Shah Convoy: పరేడ్ గ్రౌండ్ సభ తర్వాత హరిత ప్లాజాకు బయల్దేరిన అమిత్ షా కాన్వాయ్‌కు ఓ కారు అడ్డొచ్చింది. కారు పక్కకు తీయకపోవడంతో భద్రత సిబ్బంది కారు వెనుక అద్దం పగలకొట్టారు. హరిత ప్లాజా వద్ద టీఆర్‌ఎస్ నేత కారు.. అమిత్ షా కాన్వాయ్‌కు అడ్డురావడంతోనే కారు అద్దాలు ధ్వంసం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనతో దాదాపు 5 నిమిషాల పాటు అమిత్‌ షా కాన్వాయ్ హరిత ప్లాజా ముందు ఆగిపోయింది. అయితే టెన్షన్‌లో అలా జరిగిపోయింది అని ఆ కారులోని వ్యక్తి చెబుతున్నాడు.

హోంమంత్రి అమిత్ షా కాన్వాయ్‌కి అడ్డుగా వచ్చిన రెడ్ కలర్ కారును పోలీసులు గుర్తించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ కారుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. భద్రత వైఫల్యం జరిగిందని కేంద్ర నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. ఎక్కడ ఏమి జరిగిందని హరితా ప్లాజా దగ్గర ఆరా తీస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story