పోలీస్‌ వలయంలో హైదరాబాద్‌.. రంగంలోకి దిగిన స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్..

Security Beefed In Hyderabad: హైదరాబాద్‌లో ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేసింది పోలీస్‌ శాఖ.

Arun Chilukuri
Published on: 1 July 2022 3:48 PM IST
Security Beefed In Hyderabad Ahead of PM Modi Visit
X

పోలీస్‌ వలయంలో హైదరాబాద్‌.. రంగంలోకి దిగిన స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్..

Security Beefed In Hyderabad: హైదరాబాద్‌లో ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేసింది పోలీస్‌ శాఖ. నగరంతో పాటు నోవాటెల్‌ హోటల్‌ చుట్టూ అదనపు బలగాలు మోహరించాయి. ఇప్పటికే నోవాటెల్‌ చుట్టూ నాలుగు అంచెల V.I.P. భద్రత ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల పరిస్థితిపై SPG బృందం ఎప్పటికప్పుడు తెలంగాణ పోలీసులతో కో ఆర్డినేషన్ చేసుకుంటోంది.

నాలుగు అంచెల భద్రత, V.I.P. సెక్యూరిటీ, ప్రధాని చుట్టూ SPG ఫోర్స్‌, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ సాయుధ బెటాలియన్ దళాలు మోహరించనున్నాయి. ఇక అదనంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు రాష్ట్ర- నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఆక్టోపస్ బృందాలు, స్నైపర్‌ డాగ్‌, బాంబ్ స్క్వాడ్ బృందాలతో భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉన్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story