Vande Bharat Express: సికింద్రాబాద్‌- తిరుపతి 'వందేభారత్‌' ట్రైన్ టికెట్ ధరలు ఇవే...

Secunderabad Tirupati Vande Bharat Express Ticket Price Details Here
x

Vande Bharat Express: సికింద్రాబాద్‌- తిరుపతి ‘వందేభారత్‌’ ట్రైన్ టికెట్ ధరలు ఇవే...

Highlights

Vande Bharat Express: ఏపీ,తెలంగాణ మధ్య మరో వందే భారత్ ట్రైన్ పరుగులు పెట్టనుంది.

Vande Bharat Express: ఏపీ,తెలంగాణ మధ్య మరో వందే భారత్ ట్రైన్ పరుగులు పెట్టనుంది. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య వందేభారత్ రైలు సేవలందిస్తోంది. ఇప్పుడు రెండో వందే భారత్ ట్రైన్ రానుంది. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టనున్నారు. రేపు ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ ట్రైన్ ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో వందే భారత్ ట్రైన్‌ను మోదీ ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. 8న మోదీ ప్రారంభించినా ఆ రోజు ప్రయాణికులను అనుమతి ఉండదని రైల్వే అధికారులు తెలిపారు. 9 నుంచి వందేభారత్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మంగళవారం మినహా మిగిలిన 6 రోజులు సర్వీసులు నడుస్తాయి. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో పేర్కొన్న ప్రకారం ఈ రైలులో టికెట్ల ధరల వివరాలను పరిశీలిస్తే..

సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి ఏసీ ఛైర్‌కార్‌ టికెట్‌ ధర రూ.1680 కాగా.. ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌ టికెట్‌ రేటును రూ.3080లుగా ఫిక్స్ చేశారు. అదే మాదిరిగా, తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ఏసీ ఛైర్‌కార్‌ టికెట్‌ రేటు రూ.1625 కాగా.. ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌ టికెట్‌ ధరను రూ.3030 అని తెలిపారు. సికింద్రాబాద్‌-తిరుపతి టికెట్‌ ధరలను పరిశీలిస్తే బేస్‌ ఫేర్‌ రూ.1168గా నిర్ణయించారు. రిజర్వేషన్‌ ఛార్జీ రూ.40, సూపర్‌ ఫాస్ట్‌ ఛార్జీ రూ.45, మొత్తం జీఎస్టీ రూ.63గా పేర్కొన్నారు. రైల్లో సరఫరా చేసే ఆహార పదార్థాలకు గానూ రూ.364 చొప్పున ఒక్కో ప్రయాణికుడి నుంచి క్యాటరింగ్‌ ఛార్జీ వసూలు చేయనున్నారు. అదే తిరుపతి- సికింద్రాబాద్ రైల్లో బేస్‌ ఛార్జీని రూ.1169గా పేర్కొన్నారు. కేటరింగ్‌ ఛార్జీని మాత్రం రూ.308గా పేర్కొన్నారు. దీంతో అప్‌ అండ్‌ డౌన్‌ ఛార్జీల్లో వ్యత్యాసం నెలకొంది.

సికింద్రాబాద్‌ నుంచి ఒక్కో స్టేషన్‌కు ఛైర్‌కార్‌ ఛార్జీలు ఇలా..

సికింద్రాబాద్ టూ నల్గొండ – రూ.470

సికింద్రాబాద్ టూ గుంటూరు – రూ.865

సికింద్రాబాద్ టూ ఒంగోలు – రూ.1075

సికింద్రాబాద్ టూ నెల్లూరు – రూ.1270

ఎగ్జిక్యూటివ్‌ సెక్షన్ ఛార్జీలు ఇలా..

సికింద్రాబాద్ టూ నల్గొండ – రూ.900

సికింద్రాబాద్ టూ గుంటూరు – రూ.1620

సికింద్రాబాద్ టూ ఒంగోలు – రూ.2045

సికింద్రాబాద్ టూ నెల్లూరు – రూ.2455

Show Full Article
Print Article
Next Story
More Stories