సికింద్రాబాద్‌ ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి.. మరణించిన వారికి ఎక్స్‎గ్రేషియా..!

Secunderabad Fire Accident PM Modi Announces 2 Lakh Ex-gratia For Victims
x

సికింద్రాబాద్‌ ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి.. మరణించిన వారికి ఎక్స్‎గ్రేషియా..!

Highlights

Secunderabad Fire Accident: సికింద్రాబాద్ లోని ఎలక్ట్రిక్ వాహనాల షోరూంలో రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Secunderabad Fire Accident: సికింద్రాబాద్ లోని ఎలక్ట్రిక్ వాహనాల షోరూంలో రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలోఎనిమిది మంది మృతి చెందారు. ముగ్గురు అక్కడికక్కడే మరణించగా మరో ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మరి కొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ఈ ఘనలో మరణించిన వాళ్లకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ (ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి) తరపున రూ. 2 లక్షల ఎక్స్‎గ్రేషియా ప్రకటించారు. అదేవిధంగా అగ్ని ప్రమాదంలో గాయపడిన వాళ్లకు రూ. 50వేలు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం ట్విటర్‌లో ఓ ట్వీట్‌ చేసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories