Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు 14 రోజుల పాటు రిమాండ్.. చంచల్‌గూడ జైలుకి తరలింపు

Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు సికింద్రాబాద్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.

Arun Chilukuri
Updated on: 28 Aug 2021 1:34 PM IST
Secunderabad Court Remanded Teenmar Mallanna for 14 Days
X

Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు 14 రోజుల పాటు రిమాండ్..

Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు సికింద్రాబాద్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఐపీసీ 306, 511 సెక్షన్లు పెట్టడంపై తీన్మార్ మల్లన్న తరుపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఫిర్యాదు దారుడు ఎలాంటి సూసైడ్ అటెంప్ట్ చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు న్యాయవాది. దానిని పరిశీలిస్తామని కోర్టు తెలిపింది. చిలకలగూడా పోలీసులు 7 రోజుల పాటు కస్టడికి కోరారు. బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేయనున్నారు నవీన్ తరుపు న్యాయవాది.

ఆయన్ను చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ను చిలకలగూడ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని తనను బెదిరించాడని ఒక వ్యక్తి కొద్దిరోజుల క్రితం చిలకలగూడ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చిలకలగూడ కేసులో శుక్రవారం రాత్రి ఆయనను అరెస్టు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story