TS BJP: తెలంగాణ బీజేపీ నేతల రహస్య భేటీ.. ఈటల వ్యవహార శైలిపై..

TS BJP: నియోజకవర్గాల్లో చేరికలపై సంప్రదించకపోవడంపైనా అసంతృప్తి

Shekhar G
Updated on: 18 Sept 2023 6:00 PM IST
Secret Meeting Of Telangana BJP Leaders
X

TS BJP: తెలంగాణ బీజేపీ నేతల రహస్య భేటీ

TS BJP: తెలంగాణ బీజేపీ నేతల రహస్య భేటీ కలకలం రేపుతోంది. సమావేశానికి హాజరైన వారిలో.. రాజ్‌గోపాల్‌రెడ్డి, విజయశాంతి, వివేక్ వెంకటస్వామి.. ఏనుగు రవిందర్ రెడ్డి, చాడా సురేష్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు ఇతరు నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. ఈటల రాజేందర్ వ్యవహార శైలిపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. హైదరాబాద్ పర్యటకు వచ్చిన అమిత్‌షా... కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్‌కు మాత్రమే సమయం ఇవ్వడంపై నేతల ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.

అమిత్ షాతో సమావేశానికి తమను పిలవకపోవడంపై నేతలు కినుకు వహించినట్టు సమచారం. అలాగే నియోజకవర్గాల్లో చేరికలపైనా సంప్రదించక పోవడంపై నేతలు అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ములుగు నుండి మాజీ మంత్రి చందూలాల్ కొడుకు చేరడం సంగారెడ్డిలో పులిమామిడి రాజు చేరిక పై ఆగ్రహంతో ఉన్నారు నేతలు. తమను కనీసం సంప్రదించకుండానే ఏకపక్షంగా వారిని పార్టీలో చేర్చుకున్నారంటున్న బీజేపీ నియోజకవర్గ నేతలు, ఇంచార్జులు.

Shekhar G

Shekhar G

Next Story