BJP: బీజేపీ నేతల రహస్య సమావేశం..ఈటలకు వ్యతిరేకంగా ఒక్కటైన సీనియర్లు..?

BJP గంటన్నరగా కొనసాగుతోన్న బీజేపీ సీనియర్ నేతల రహస్య సమావేశం

Dhatripriya
Published on: 11 Jun 2023 4:22 PM IST
Secret Meeting Of BJP Leaders Seniors United Against Etela Rajender
X

BJP: బీజేపీ నేతల రహస్య సమావేశం..ఈటలకు వ్యతిరేకంగా ఒక్కటైన సీనియర్లు..?

BJP: తెలంగాణ బీజేపీలో అసమ్మతి సెగలు రగులుతున్నాయి. ముందు నుంచి పార్టీలో ఉన్న సీనియర్లకు ప్రాధాన్యత దక్కడం లేదంటూ సీనియర్‌ బీజేపీ నేతలు రహస్యంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జితేందర్ రెడ్డి, విజయశాంతి, జితేందర్ రెడ్డి రవీంద్ర నాయక్, బూర నర్సయ్య గౌడ్‌, కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. బీజేపీలో జరుగుతున్న తాజా పరిణామాలపై చర్చిస్తున్నారు. అయితే వీరంతా ఈటలకు వ్యతిరేకంగా ఒక్కటవుతున్నట్లు తెలుస్తోంది. ఈటలకు ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి అంటూ జరుగుతున్న ప్రచారంపై సీనియర్ నేతలంగా పెదవి విరుస్తున్నట్లు సమాచారం. బీజేపీ సిద్ధాంతాల కోసం పనిచేస్తున్న తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సీనియర్ లీడర్లు. ఈటల కేవలం కేసీఆర్‌‌ను ఓడించేందుకు మాత్రమే వచ్చారని... పార్టీకి నష్టం కలిగించే కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారని ఆవేదన చెందుతున్నట్లు సమాచారం.

Dhatripriya

Dhatripriya

Next Story