Coronavirus: రాష్ట్రంలో మరింత పెరుగుతున్న కరోనా రెండోదశ వ్యాప్తి

Coronavirus: రాష్ట్రంలో మరో 1,321 కరోనా కేసులు, 5 మరణాలు * కరోనా నుంచి కోలుకున్న మరో 293 మంది బాధితులు

Sandeep Eggoju
Updated on: 4 April 2021 1:52 PM IST
Second Wave Corona Spreading in Telangana State
X

కరోన వైరస్ (ఫైల్ ఇమేజ్)

Coronavirus: తెలంగాణలో కరోనా రెండో దశ వ్యాప్తి మరింతగా పెరుగుతోంది. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 8000కు చేరువైంది. గడిచిన 24 గంటల్లో 62వేల 973 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,321 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి కరోనా సోకిన వారి సంఖ్య 3లక్షల 12వేల 140కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 7వేల 923 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

తాజాగా కరోనాతో ఐదుగురు మృతి చెందగా.. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,717కి చేరింది. నిన్న 293 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,886 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా 320 కరోనా కేసులు నమోదయ్యాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story