Sheep Distribution: తెలంగాణలో త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీ

Sheep Distribution: తెలంగాణలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్.

Arun Chilukuri
Updated on: 20 July 2021 4:23 PM IST
Second Phase Sheep Distribution Soon in Telangana
X

తెలంగాణలో త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీ

Sheep Distribution: తెలంగాణలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. ఇప్పటికే మొదటి విడత ద్వారా 5వేల కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన గొర్రెల పంపిణీ అద్భుతమైన ఫలితాన్నిచ్చిందన్న కేసీఆర్‌ రెండో విడత కోసం 6వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అందుకు కావాల్సిన నిధులను సమకూర్చాలని ఆర్థికశాఖను ఆదేశించారు.

ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. కుల వృత్తులన్నీ బీసీ వర్గాలే నిర్వహిస్తున్నాయని, వారిని అన్ని రంగాల్లో ఆదుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తోందని అన్నారు సీఎం కేసీఆర్‌. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచి, బీసీల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు. నాటి సమైక్య పాలనలో ధ్వంసమైన తెలంగాణ కుల వృత్తులను ఒక్కొక్కటిగా తీర్చిదిద్దుతూ, గాడిన పెడుతున్నామన్నారు సీఎం కేసీఆర్. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలమైన కులవృత్తులను మరింతగా ప్రోత్సహిస్తామన్నారు కేసీఆర్‌.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story