Metro Train: హైదరాబాద్ సిటీలో మెట్రోరైలు రెండో దశ ప్రారంభం

Second Phase of Metro Rail Has Started in Hyderabad City
x

Metro Train: హైదరాబాద్ సిటీలో మెట్రోరైలు రెండో దశ ప్రారంభం

Highlights

Metro Train: డిసెంబర్ 9న ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్న సీఎం

Metro Train: హైదరాబాద్ నగరానికి మరో మణిహారం... మెట్రో రెండో దశ ప్రాజెక్టు వచ్చేస్తోంది. హైదరాబాద్ సిటీలో ప్రస్తుతం పరుగులు పెడుతోన్న మెట్రో రైలు... ఇప్పుడు శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు వెళ్లనుంది. ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ మెట్రో ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ డిసెంబర్‌లో శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్‌లో రాబోతున్న రెండో దశ మెట్రో రైలు ప్రాజెక్టుపై హెచ్ఎంం టీవీ గ్రౌండ్ రిపోర్ట్...

హైదరాబాద్‌ నగరంలో మెట్రో రైలును పొడిగించనున్నారు... ఇప్పటివరకు మైండ్‌స్పేస్ జంక్షన్ వద్ద ఉన్న రాయదుర్గం మెట్రో టర్మినల్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో కారిడార్‌ను విస్తరించనున్నారు. దీంట్లో భాగంగా డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. రానున్న మూడు సంవత్సరాల్లో మెట్రో ప్రాజెక్టును పూర్తి చేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.

విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోన్న హైదరాబాద్ నగరంలో.. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ మెట్రో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు... ప్రపంచస్థాయి పెట్టుబడులతో భారీగా విస్తరిస్తున్న ఈ మహానగరంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువే... ఈ నేపథ్యంలో మెట్రోను విమానాశ్రయం వరకు అనుసంధానించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మెట్రో ప్రాజెక్ట్‌తో మరిన్ని పెట్టుబడులకు సిటీ గమ్యస్థానంగా మారబోతోంది.

రెండో దశలో ప్రారంభించనున్న మెట్రో రైలు బయోడైవర్శిటీ జంక్షన్ కాజాగూడ రోడ్డు ద్వారా ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద ఉన్న నానక్‌రామ్‌గూడ జంక్షన్‌ను తాకుతూ వెళుతుంది. 31 కిలోమీటర్ల పొడవుతో కూడిన ఈ మెట్రో ప్రాజెక్టును 6 వేల 250 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. కాగా... ఈ మార్గం వెంట పలు అంతర్జాతీయ సంస్థలు తమ కార్యాలయాలను నిర్మించుకుంటున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories