TSPSC: TSPSC పేపర్ లీక్ కేసులో రెండోరోజు ఈడీ ఎంక్వైరీ

TSPSC: నిన్న చంచల్‌గూడ జైల్లో ప్రవీణ్‌, రాజశేఖర్‌లను విచారించిన ఈడీ

Dhatripriya
Updated on: 18 April 2023 7:24 AM IST
Second Day Of ED Inquiry In TSPSC Paper Leak Case
X

TSPSC: TSPSC పేపర్ లీక్ కేసులో రెండోరోజు ఈడీ ఎంక్వైరీ

TSPSC: TSPSC పేపర్ లీక్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తొలిరోజు విచారణ ముగిసింది. ‎చంచల్‌గూడ జైలులో నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌ ఖాతాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు ED అధికారులు. TSPSCలో పనిచేసే కొంతమంది పేపర్ లీక్ చేశారని.. లక్షల రూపాయల డబ్బులు చేతులు మారాయని గుర్తించారు.

ఇక విచారణలో పేపర్ విక్రయించిన డబ్బులను ఎక్కడ మరల్చారని నిందితులను ప్రశ్నించారు ED అధికారులు. ఎంతమందికి పేపర్లను విక్రయించారని.. ఎన్ని డబ్బులు సంపాదించారనే విషయాలపై కూపీ లాగారు. రేణుక,లౌకిక్‌ల నుంచి తీసుకున్న 11 లక్షల రూపాయల లావాదేవీలు ఎలా జరిపారని.. రాజశే‌ఖర్‌ నుంచి పేపర్లు మారే సమయంలో నగదు లావాదేవీలు ఎలా జరిగాయని ప్రశ్నించారు.

Dhatripriya

Dhatripriya

Next Story