Hyderabad IT Raids: హైదరాబాద్‌లో ఐటీ అధికారుల సోదాలు.. రూ.3 కోట్లు స్వాధీనం

Searches By IT Officials In Hyderabad
x

Hyderabad IT Raids: హైదరాబాద్‌లో ఐటీ అధికారుల సోదాలు.. రూ.3 కోట్లు స్వాధీనం

Highlights

Hyderabad IT Raids: మరో రెండ్రోజులు సోదాలు కొనసాగుతాయని సమాచారం

Hyderabad IT Raids: హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఓ సంస్థపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ సంస్థకు చెందిన యజమాని వద్ద 3 కోట్ల రూపాయలు పోలీసులు సీజ్ చేయడంతో అధికారులు సదరు సంస్థపై ఫోకస్ పెట్టారు. అయితే కర్నాటక నుంచి డబ్బులు తరలిస్తున్న ఆ సంస్థ యజమానిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అయితే స్వాధీనం చేసుకున్న 3 కోట్ల రూపాయలను ఐటీ శాఖకు అప్పగించారు. దీంతో ఆ సంస్థకు చెందిన రియల్ ఎస్టేట్, ఇన్ ఫ్రా డెవలపర్స్, ఇతర వ్యాపారాలపై ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఆ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. గత మూడ్రోజుల నుంచే ఐటీ సోదాలు కొనసాగుతున్నా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరో రెండ్రోజుల పాటు ఐటీ అధికారులు కొనసాగుతాయని సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories