తెలంగాణ విద్యాసంస్థలకు సెలవులు పొడిగించే ఛాన్స్

School Holidays Likely to be Extended in Telangana
x

తెలంగాణ విద్యాసంస్థలకు సెలవులు పొడిగించే ఛాన్స్

Highlights

School Holidays: తెలంగాణ రాష్ట్రమంతా విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు పొడిగించే అవకాశం కనిపిస్తోంది.

School Holidays: తెలంగాణ రాష్ట్రమంతా విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు పొడిగించే అవకాశం కనిపిస్తోంది. కరోనా థర్డ్ వేవ్ కారణంగా జనవరి మొదటి వారంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరగడంతో సంక్రాంతి సెలవులను మూడు రోజుల ముందుకు జరిపి విద్యార్ధులకు ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఇచ్చింది. అయితే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, పాజిటివ్ కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని మరికొద్ది రోజులు సెలవులను పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ఆంక్షలు ఈ నెల 20వ తేదీ వరకు కట్టుదిట్టంగా అమలవుతున్న నేపధ్యంలో విద్యాసంస్థలకు సైతం సెలవులు పొడిగించాలని వైద్యారోగ్య శాఖ సూచించినట్లు తెలుస్తోంది. దీనితో సెలవులను జనవరి 20వ తేదీ వరకు పొడిగించనున్నారని సమాచారం. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రమే ఇప్పటి దాకా అధికారిక ప్రకటన రాలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories