PM Modi: తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన షెడ్యూల్‌

Schedule Of Prime Minister Modi Visit To Telangana
x

PM Modi: తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన షెడ్యూల్‌

Highlights

PM Modi: ఈనెల 27న హైదరాబాద్‌లో ప్రధాని మోడీ భారీ రోడ్‌ షో

PM Modi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో పార్టీలో దూకుడు పెంచాయి. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు జోరుగా ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఇందులో భాగంగా కాసేపట్లో ప్రధాని మోడీ హైదరాబాద్‌కు రానున్నారు. పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే మాదిగ విశ్వరూప మహాసభలో పాల్గొననున్నారు.

ఈ నెల 25, 26, 27వ తేదీల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ప్రధాని మోడీ. 25న కరీంనగర్‌లో జనగర్జన సభ, 26న నిర్మల్ జనగర్జన సభ, 27న హైదరాబాద్‌లో ప్రధాని మోడీ భారీ రోడ్ షో నిర్వహించనున్నారు.

సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు మోడీ చేరుకుంటారు. ఆ తర్వాత 5 గంటల 40 నిమిషాలకు పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలో ప్రధాని మోడీ కీలక ప్రకటన చేస్తారని నేతలు భావిస్తున్నారు. సభ అనంతరం తిరిగి సాయంత్రం 6 గంటల తర్వాత బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి పయనమవుతారు ప్రధాని మోడీ. ప్రధాని మోడీ రాక నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories