Satyavathi Rathod: కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్నా.. బీజేపీకి అభ్యర్థులు లేరు

Satyavathi Rathod: అక్కడ చేయలేని మీరు ఇక్కడ ఎలా చేస్తారు..?

Shekhar G
Published on: 17 Oct 2023 5:50 PM IST
Satyavathi Rathod Comments On BJP Party
X

Satyavathi Rathod: కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్నా.. బీజేపీకి అభ్యర్థులు లేరు 

Satyavathi Rathod: కేంద్రంలో 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ, 10 ఏళ్లు ప్రతిప‎క్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలు కనీసం 10 మంది అభ్యర్థులను కూడా ప్రకటించే పరిస్థితిలో లేవని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ దుయ్యబట్టారు. మహబూబాబాద్ జిల్లాలో ముఖ్య నాయకుల సమావేశానికి హాజరైన ఆమె.. కాంగ్రెస్‌కు, బీజేపీకి అభ్యర్థులే కరువయ్యారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 500 కు గ్యాస్ సిలిండర్, 4 వేల పెన్షన్ ఇస్తామని ఆరు గ్యారెంటీలో ప్రకటించారని.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ పధకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అక్కడ అమలు చేయని మీరు ఇక్కడ ఎలా అమలు చేస్తారని క్వశ‌్చన్ చేశారు.

Shekhar G

Shekhar G

Next Story