Satyavathi Rathod: శంకర్‌నాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తే.. గూడూరు మండలాన్ని దత్తత తీసుకుంటాం

Satyavathi Rathod: 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు

Jyothi
Published on: 8 Nov 2023 8:11 AM IST
Satyavathi Rathod Comments On Congress
X

Satyavathi Rathod: శంకర్‌నాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తే.. గూడూరు మండలాన్ని దత్తత తీసుకుంటాం 

Satyavathi Rathod: కాంగ్రెస్‌ నేతలు అన్నీ మాయమాటలు చెబుతున్నారని, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సంక్షేమ పథకాలు అమలుకావడం లేదని విమర్శించారు మంత్రి సత్యవతి రాథోడ్. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండల కేంద్రంలో బూత్‌ కమిటీల విస్తృత స్థాయి సమావేశానికి సత్యవతి రాథోడ్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు మంత్రి సత్యవతి రాథోడ్. కాంగ్రెస్‌ నాయకులు.. 24 గంటల కరెంట్‌ ఇవ్వొద్దంటూ కేంద్రానికి లేఖలు రాశారని ఆమె గుర్తుచేశారు. 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. ఇక.. శంకర్‌నాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తే.. గూడూరు మండలాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు సత్యవతి రాథోడ్.

Jyothi

Jyothi

Next Story