సింగరేణి బొగ్గు గనులతో కాలుష్యం కోరల్లో సత్తుపల్లి

సింగరేణి బొగ్గు గనులతో కాలుష్యం కోరల్లో సత్తుపల్లి
x
Highlights

సింగరేణి బొగ్గు గనులతో సర్వం కలుషితమవుతోంది. ప్రధానంగా సత్తుపల్లిని వాయు కాలుష్యం ఆవిరిస్తోంది. భూగర్భజలాలు సైతం అడుగంటి పంటలపై తీవ్ర ప్రభావం...

సింగరేణి బొగ్గు గనులతో సర్వం కలుషితమవుతోంది. ప్రధానంగా సత్తుపల్లిని వాయు కాలుష్యం ఆవిరిస్తోంది. భూగర్భజలాలు సైతం అడుగంటి పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అదేవిధంగా బ్లాస్టింగులతో సత్తుపల్లిలోని ఇళ్లు దెబ్బతింటున్నాయి. ఓపెన్‌కాస్టు బొగ్గుగనుల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అది ఖమ్మం జిల్లా సత్తుపల్లి. అక్కడ 15 ఏళ్లుగా జేవీఆర్‌ ఓపెన్‌కాస్ట్‌ బొగ్గు గనుల తవ్వకాలు జరుగుతున్నాయి. అయితే బాంబ్‌ పేలుళ్ల తీవ్రత వల్ల సత్తుపల్లి, రేజర్ల, కిష్టారం గ్రామాలు కంపించిపోతున్నాయి. అదేవిధంగా సత్తుపల్లిలోని ఎన్‌.టీ.ఆర్‌ కాలనీ ప్రజలు బాంబుల పేలుళ్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక గనిలో బ్లాస్టింగ్‌ తీవ్రతకు కాలనీలోని 730 ఇళ్లన్నీ పాడైపోయాయి. నిద్రిస్తున్న సమయంలో ఇంటి స్లాబ్‌ పెచ్చులూడి కిందపడటంతో గాయలపాలవుతున్నారు. మరోవైపు గోడలు నెర్రలు విచ్చి విడిపోయో విధంగా శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో తమ బాధను సంబంధిత అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సింగరేణి అధికారులు మాత్రం అనుమతులకు అనుగుణంగానే తాము బ్లాస్టింగ్స్‌ జరుపుతున్నామని చెబుతున్నారు. అయితే కాలనీ వాసులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్‌ జరుపుతున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు బ్లాస్టింగ్ సమయంలో విడుదలవుతున్న దుమ్ము-ధూలితో అనారోగ్య పాలవుతున్నామని వాపోతున్నారు. ప్రధానంగా ఊపిరితిత్తుల సమస్యతో సతమతవుతున్నామని చెబుతున్నారు. ఇక సత్తుపల్లి ఓసీలో ఉత్పత్తి అయ్యే ప్రతీ టన్ను బొగ్గుకు 90 రూపాయల చొప్పున రోజుకు కొన్ని లక్షల రూపాయల మినరల్ ఫండ్‌ సింగరేణి సంస్థ జమచేస్తుందంటున్నారు సత్తుపల్లి వాసులు. అయితే ఈ నిధులను తమకు ఖర్చు చేయకుండా వేరే ప్రాంతాలకు ఖర్చు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఇక బాంబు మోతలకు తట్టుకోలేక ఎన్‌.టీ.ఆర్ కాలనీకి చెందిన బాణోత్‌ నందునాయక్‌ ఎన్‌.జి.టీ చెన్నై బెంచ్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌ను విచారించిన జస్టిస్‌ రామకృష్ణన్‌ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం నివేదికను నవంబర్‌ 9లోగా అందించాలని ఎన్‌.జి.టీ కమిటీ సమన్వయ బాధ్యత పర్యావరణ శాఖ అధికారికి అప్పగించింది. ఇక నందు నాయక్‌ వేసిన పిటీషనర్‌ తరుపు న్యాయవాది, ఖమ్మం జిల్లా కలెక్టర్‌ గత ఏడాది జూన్‌లో విచారణ జరిపించినా కమిటీ సిఫార్సులను అమలు చేయలేదని వివరించారు. దీంతో కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి కాలరీస్ సంస్థ, ఖమ్మం జిల్లా కలెక్టర్లకు నోటీసులు జారీ అయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్‌ కాస్ట్‌లో జరుగుతున్న పరిస్థితులు అధ్యయనం చేయాలంటూ నిపుణుల కమిటీనీ ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీ నివేదికతోనైనా తమకు న్యాయం జరుగుతుండొచ్చని పిటిషనర్‌ నందు నాయక్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏదీ ఏమైనా సత్తుపల్లి, రేజర్ల, క్రిష్టారం ప్రజల బాధలను అధికారులు పట్టించుకోవాలి. ప్రభుత్వం వారి సమస్యలకు పరిష్కారం చూపాలని మనమందరం కోరుకుందాం.

Show Full Article
Print Article
Next Story
More Stories