Wanaparthy: విషాదం.. ఇల్లు కూలి సర్పంచ్‌ మృతి

Wanaparthy: వనపర్తి జిల్లా రేవల్లి మండలం బండరావిపాకుల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

Arun Chilukuri
Published on: 23 Jun 2021 2:22 PM IST
Sarpanch Died After Roof Collapsed in Wanaparthy District
X

Wanaparthy: విషాదం.. ఇల్లు కూలి సర్పంచ్‌ మృతి

Wanaparthy: వనపర్తి జిల్లా రేవల్లి మండలం బండరావిపాకుల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి పైకప్పు కూలి బండరావిపాకుల సర్పంచ్‌ గంగనమోని లక్షమ్మ, ఆమె మనవడు యోగేశ్వర్ మృతి చెందారు. ఈ సంఘటన అర్థరాత్రి సంభవించింది. ఎంతకి వీళ్లు బయటకు రాకపోవటం గ్రామ ప్రజలు గమనించి ఇంటి పైకి ఎక్కి చూడగా పైకపు పడిపోవడం కనిపించడంతో ఇంట్లో కి వెళ్లి మృతదేహాలను వెలికితీశారు.

లక్షమ్మ భర్త బయటపడుకోవడంతో అతని ప్రాణాలు దక్కించుకున్నారు. లక్షమ్మ ప్రస్తుతం బండరాయిపాకుల సర్పంచ్ గా కొనసాగుతుంది. సర్పంచ్‌ మృతిపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వపరంగా బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా అండగా ఉంటామని వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story