Mancherial: అన్న పిల్లలను తప్పించబోయి.. తమ్ముడు శరత్ కుమార్ మృతి
Mancherial ఇసుక ట్రాక్టర్ తగిలి ఆటోపై తెగిపడ్డ విద్యుత్ తీగలు
Mancherial: అన్న పిల్లలను తప్పించబోయి.. తమ్ముడు శరత్ కుమార్ మృతి
Mancherial: అన్న పిల్లలను కాపాడపోయి తమ్ముడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. బెల్లంపల్లి లోని బుడిదగడ్డ బస్తీలో శరత్ కుమార్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శరత్ రోజూ మాదిరిగానే ఇంటివద్ద ఆటోను శుభ్రం చేస్తుండగా ఇసుక ట్రాక్టర్ తగిలి విద్యుత్ తీగలు తెగిపోయి ఆటో పై పడ్డాయి. దీంతో ఆటోలో అన్న రాజ్ కుమార్ సహా అతని ఇద్దరు పిల్లలు కూర్చుని ఉండటంతో వారిని రక్షించడానికి వెళ్లిన శరత్ కుమార్ విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. శరత్ మృతితో బస్తీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story




