ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరో సెన్సేషన్‌..అప్పులోళ్లనూ వేదికపైకి పిలిచి కార్యకర్తలకు పరిచయం

ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరో సెన్సేషన్‌..అప్పులోళ్లనూ వేదికపైకి పిలిచి కార్యకర్తలకు పరిచయం
x
Highlights

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరో సెన్సేషన్‌ వంద కోట్లు అప్పులు తీసుకున్నానని స్టేట్‌మెంట్‌ అప్పులోళ్లనూ వేదికపైకి పిలిచి కార్యకర్తలకు పరిచయం

విలక్షణ రాజకీయాలకు పెట్టింది పేరు ఆ ఎమ్మెల్యే. కడుపులో ఏదీ దాచుకోకుండా చెప్పాలనుకున్నది చెప్పేస్తారు. అప్పులు చేసి రాజకీయాలు చేస్తున్నానన్న వంద కోట్ల అప్పులు ఉన్నాయని బహిరంగంగా చెప్పడమైనా ఆయనకే చెల్లింది. ఇరవై ఏళ్ల రాజకీయ జీవితంలో, భార్యకు ఇరవై తులాల బంగారం కొనివ్వలేక పోయానని అలా అని డబ్బు సంపాదించలేదా అంటే అలా కూడా కాదనీ సంపాదన అంతా పంచి పెట్టడమేననీ అప్పులు చేసి మరీ పంచుతానీ అన్నారు ఆ సెన్సేషన్‌ లీడర్. ఆ వెంటనే అప్పులు ఇచ్చిన వ్యక్తులు ఎక్కడెక్కడి నుంచి తెచ్చిచ్చారు ఏఏ సందర్భాల్లో ఇచ్చారో కార్యకర్తల సమావేశంలో బహిరంగంగా చెప్పేశారట. వారిని స్టేజి మీదకు పిలిచి మరీ పరిచయం చేశారట ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఇంతకీ ఆ 100 కోట్ల అప్పు సంగతేంటి?

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ శివారు వెంకటేశ్వర గార్డెన్స్ లో, తన నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు జగ్గారెడ్డి. ఈమధ్య కాలంలో కార్యకర్తల నుంచి వస్తున్న సందేహాలు, అనుమానాలు, ప్రశ్నలపై క్లారిటీ ఇచ్చారాయన. కార్యకర్తలు ఎవరూ అధైర్య పడవద్దని అందరినీ కాపాడుకునే బాధ్యత తనదేనన్నారు. ముఖ్యంగా టిఆర్ఎస్, బిజెపిలపై విమర్శలు చేసే సమయం ఇప్పుడు కాదనీ తాను ఏది చేసినా స్టాటజిక్ గా చేస్తానని ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోవాలన్నారు జగ్గారెడ్డి.

తాను అప్పులు చేసి రాజకీయాలు చేస్తున్నానన్నారు జగ్గారెడ్డి. తను కుటుంబం కోసం దాచింది ఏమీ లేదనీ సంపాదించింది అంతా అందరికీ పంచిపెట్టాననీ తెలిపారు. తనకు వంద కోట్ల అప్పులు ఉన్నాయంటే ఎవరూ నమ్మరనీ కానీ నిజమన్నారు. ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో భార్యకు ఇరవై తులాల బంగారు కొనివ్వలేక పోయానని భావోద్వేగంగా మాట్లాడారు. తనలాంటి లీడర్లు ఎవరూ ఉండరనీ, తన జీవితమే రిస్క్ అని అన్నారు. జగ్గారెడ్డిని ఎవరూ కొనలేరని నియోజకవర్గ ప్రజల కోసం,అభివృద్ధి కోసం తలవంచాల్సి వస్తే వంచుతాననీ అన్నారు. అంతేకాదు తనకు అప్పులు ఇచ్చిన వ్యక్తులను స్టేజీ మీదకు పిలవడంతో ఆశ్చర్యపోయారట కార్యకర్తలు. మొత్తానికి ఏం మాట్లాడినా, ఏం చేసినా, తన రూటే సెపరేటని నిరూపించుకుంటారు జగ్గారెడ్డి. ఇప్పుడు అప్పులిచ్చిన వారందర్నీ స్టేజిపైకి పిలిచి మరీ, కార్యకర్తలకు పరిచయం చేయడం, జగ్గారెడ్డికే చెల్లిందని అందరూ మాట్లాడుకుంటున్నారట.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories