Jagga Reddy: గజ్వేల్ సభలో నాకు అవమానం జరిగింది

* గజ్వేల్ సభలో గీతా రెడ్డి నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు * నేను టీఆర్ఎస్‌లోకి వెళ్లాలంటే ఆపేది ఎవరూ: జగ్గారెడ్డి

Sandeep Reddy
Published on: 24 Sept 2021 1:01 PM IST
Sangareddy MLA Jagga Reddy Says Geeta Reddy Did not give me the Opportunity to talk in Gajwel Meeting
X

జగ్గారెడ్డి (ఫోటో: ది హన్స్ ఇండియా)

Jagga Reddy: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల్లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సీరియస్ అయ్యారు. మీడియాతో జరిగిన చిట్ చాట్‌లో జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నేను టీఆర్‌ఎస్‌లోకి వెళ్లాలంటే ఎవరు అడ్డుచెప్తారంటూ కీలక వ్యాఖ‌్యలు చేశారు. గజ్వెల్ సభలో గీతారెడ్డి తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని అన్నారు.

గీతారెడ్డిపై గౌరవముందని కానీ గజ్వేల్ సభలో అవమానం జరిగిందన్నారు. నేను కూడా 2లక్షల మందితో సభ పెట్టగలనని, రాష్ట్రంలో నాక్కూడా అభిమానులు ఉన్నారని అన్నారు. పార్టీ కోసం పని చేసే నాకే అవమానాలు జరుతున్నాయని తెలిపారు. పార్టీలో మాట్లాడే అవకాశం దొరకలేదు కాబట్టే మీడియాతో ఆవేదన తెలుపుకుంటున్నానని అన్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story