Nirmal: ఆఫీసర్‌పై పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టిన సాంవ్లి గ్రామ సర్పంచ్‌

నిర్మల్‌ జిల్లాలో దారుణం గ్రావెల్‌ వర్క్‌కు సంబంధించి ఫైల్‌పై సంతకం పెట్టాలన్న సర్పంచ్‌ సంతకం చేసేందుకు నిరాకరించిన

Sandeep Reddy
Published on: 13 July 2021 8:38 PM IST
Samvli Village Sarpanch Who Poured Petrol on The Officer And Set Him on Fire
X

ఉపాధి హామీ ఆఫీస్ (ఫైల్ ఫోటో)

Nirmal: నిర్మల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సాంవ్లి గ్రామంలో ఓ ఆఫీసర్‌పై సర్పంచ్‌ పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. సాంవ్లి పంచాయతీలో ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు రావుల రాజు. ఈయన మూగ వ్యక్తి. అయితే గ్రామంలో గ్రావెల్‌ వర్క్‌ విషయమై ఆఫీస్‌కు వచ్చిన సర్పంచ్‌ సాయినాథ్‌ ఓ ఫైల్‌పై సంతకం కావాలని కోరాడు. దానికి రాజు నిరాకరించడంతో ఆగ్రహానికి గురై పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టాడు. హుటాహుటిన మంటలు ఆర్పిన స్థానిక సిబ్బంది రాజును భైంసాలోని ఓ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story