Samantha: నాగచైతన్య ఫోటోలు డిలీట్ చేస్తున్న సమంత

Samantha: అభిమానులకి మరొక షాక్ ఇచ్చిన సమంత

admin1
Updated on: 29 Oct 2021 1:31 PM IST
Samantha Deleting the Naga Chaitanya Photos From Social Media
X

నాగచైతన్య ఫోటోలు డిలీట్ చేస్తున్న సమంత (ఫైల్ ఇమేజ్)

Samantha: సోషల్ మీడియాలో తన పేరుని సమంత అక్కినేని నుంచి ఎస్ గా మార్చుకున్న సమంత అప్పటినుంచి తన విడాకుల గురించి హింట్స్ ఇస్తూనే వచ్చింది. ఇక తాజాగా నాగచైతన్యతో తాను విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది సమంత. ఈ మధ్యనే తన స్నేహితులతో కలిసి చార్థాం వెకేషన్ నుంచి తిరిగి వచ్చిన సామ్ తన సోషల్ మీడియాలో నాగచైతన్యతో కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పటిదాకా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సమంత పెళ్లి అయిన తర్వాత నుంచి కూడా నాగచైతన్య ఫోటోలు బాగానే షేర్ చేస్తూ ఉండేది. కానీ ఇప్పుడు విడాకులు తీసుకున్న తర్వాత సమంత ఆ ఫోటోలన్నీ మళ్ళీ తిరిగి డిలీట్ చేస్తోంది.

ఇప్పటిదాకా దాదాపు 85 ఫోటోలు డిలీట్ చేసేసింది సామ్. దీంతో అభిమానులు మరింత నిరాశ చెందుతున్నారు. మరికొద్ది రోజుల్లో సమంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో నాగచైతన్య మరియు మిగతా అక్కినేని హీరోల ని ఫాలో అవ్వడం కూడా మానేస్తుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా సమంత ఇంత తొందరగా మూవ్ ఆన్ కావడంతో అభిమానులు కూడా సంతోషిస్తున్నారు. ఇక సమంత గుణశేఖర్ దర్శకత్వంలో "శాకుంతలం" అనే సినిమాతో బిజీగా ఉంది. మరోవైపు తమిళంలో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి మరియు నయనతార ముఖ్యపాత్రలు పోషిస్తున్న "కాతు వాకులా రెండు కాదల్" సినిమాలో కూడా నటిస్తోంది.

admin1

admin1

Next Story