Sama Ranga Reddy: స్వచ్ఛభారత్ కార్యక్రమంతో సమాజంలో ఎంతో మార్పు వచ్చింది

Sama Ranga Reddy: స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు అవహేళన చేశాయి

Jyothi
Published on: 1 Oct 2023 3:06 PM IST
Sama Rangareddy Swept the Roads with a Broom in LB Nagar
X

Sama Ranga Reddy: స్వచ్ఛభారత్ కార్యక్రమంతో సమాజంలో ఎంతో మార్పు వచ్చింది

Sama Ranga Reddy: నరేంద్ర మోడీ చేపట్టిన స్వచ్ఛభారత్ అనే మహోన్నతమైన కార్యక్రమంతో సమాజంలో ఎంతో మార్పు వచ్చిందని రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి అన్నారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా ఎల్బీనగర్‌లో స్వచ్ ఎల్బీనగర్ కార్యక్రమం నిర్వహించారు. బీజేపి కార్యకర్తలు, మహిళా నాయకులతో కలిసి చీపురు పట్టి రోడ్లు ఊడ్చారు. మోడీ 2014లో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని తీసుకువస్తే ప్రతిపక్షాలు అవహేళన చేశాయన్నారు.

కానీ ఇప్పుడు అవే పార్టీలు చీపురు పట్టుకుని రోడ్ల మీదకి వచ్చి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే ఆయన తీసుకువచ్చిన స్ఫూర్తి ఎంత గొప్పదో అర్థమవుతుందని అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమం ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయమని ఆయన తెలిపారు.

Jyothi

Jyothi

Next Story