Sama Rangareddy: బీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వ భూములు.. పార్కులను కబ్జాలు చేస్తున్నారు

Sama Rangareddy Comments on BRS
x

Sama Rangareddy: బీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వ భూములు.. పార్కులను కబ్జాలు చేస్తున్నారు

Highlights

Sama Rangareddy: ఎల్బీనగర్ నియోజకవర్గ సమస్యలపై రాష్ట్ర పార్టీకి నివేదిక ఇస్తా

Sama Rangareddy: ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కొత్త మోసాలతో వస్తున్నారని, దీనిని ప్రజలు గమనించాలన్నారు బీజేపీ అర్బన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి. హైదరాబాద్ కొత్తపేటలో కార్పొరేటర్ పవన్ కుమార్ ఏర్పాటు చేసిన 'ప్రజా గోస - బీజేపీ భరోసా' కార్నర్ మీటింగ్‌లో సామ రంగారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ తొమ్మిదేళ్లలో రేషన్ కార్డులు, పెన్షన్లు, డబుల్ బెడ్ రూమ్‌ల కోసం ప్రజలు కాళ్లరిగేలా తిరుగుతున్నారని అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వ భూములను, పార్కులను కబ్జాలు చేస్తున్నారని సామ రంగారెడ్డి ఆరోపించారు. బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories