Sama Ranga Reddy: వారం రోజుల్లో సమస్యలు పరిష్కారం కాకపోతే..ఆందోళన చేస్తామన్న సామ రంగారెడ్డి

Sama Ranga Reddy: ఎల్బీనగర్ నియోజకవర్గంలో సామ రంగారెడ్డి పర్యటన

Jyothi
Published on: 22 April 2023 11:32 AM IST
Sama Ranga Reddy visit  LB Nagar
X

Sama Ranga Reddy: వారం రోజుల్లో సమస్యలు పరిష్కారం కాకపోతే..ఆందోళన చేస్తామన్న సామ రంగారెడ్డి

Sama Ranga Reddy: ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోని లింగోజిగూడ డివిజన్‌లో రంగారెడ్డి జిల్లా బీజేపీ అర్బన్ అధ్యక్షులు సామ రంగారెడ్డి పర్యటించారు. కాలనీల్లో పర్యటిస్తూ అక్కడి సమస్యలను పరిశీలించారు. కొంతకాలంగా లింగోజిగూడ సమస్యల వలయంలో కొట్టు మిట్టాడుతుందన్నారు సామ రంగారెడ్డి. తాగునీరు లేక ఆరు నెలలు గడుస్తున్నా అధికారులు కానీ.. స్థానిక ఎమ్మెల్యే కానీ పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. వర్షాకాలంలో కాలనీ మొత్తం నీట మునిగిందని అప్పటినుండి ఈ కాలనీ సమస్యలు తీర్చే నాథుడే లేరన్నారు సామ రంగారెడ్డి. వారం రోజుల్లో సమస్యలు పరిష్కారం కాకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

Jyothi

Jyothi

Next Story