Sama Ranga Reddy: ఎల్బీనగర్‌లో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు

Sama Ranga Reddy: వాసవి సంస్థ అర్ధరాత్రి బ్లాస్టింగ్ చేస్తోంది

Jyothi
Published on: 11 April 2023 3:04 PM IST
Sama Ranga Reddy Comments
X

Sama Ranga Reddy: ఎల్బీనగర్‌లో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు

Sama Ranga Reddy: అక్రమంగా నిర్మాణాలు చేపట్టడమే కాకుండా చుట్టుపక్కల స్థానికుల ఇండ్లు డామేజ్ అయ్యేవిధంగా వాసవి సంస్థ అర్ధరాత్రిళ్లు బ్లాస్టింగ్ చేస్తుందని రంగారెడ్డి జిల్లా బీజేపీ అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆరోపించారు. ఎల్బీనగర్‌లో అక్రమ నిర్మాణాలను పరిశీలించిన ఆయన.. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.. ఎల్బీనగర్‌లో గతంలో ఓ ఫ్యాక్టరీ ఉండేదని... దీనిని ఒక ప్రైవేట్ సంస్థ చేజిక్కించుకొని అక్కడ నిర్మాణాలు చేపడుతోందన్నారు. అయితే అక్కడ అర్ధరాత్రి చేస్తున్న బ్లాస్టింగ్‌ల కారణంగా స్థానిక కాలనీవాసులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. అక్రమ నిర్మాణాలను ఆపకపోతే ఆందోళన చేపడతామని సామ రంగా రెడ్డి హెచ్చరించారు.

Jyothi

Jyothi

Next Story