Marri Janardhan Reddy: రైతుల రుణమాఫీ కోసమే కోకాపేట భూముల అమ్మకం

Marri Janardhan Reddy: రెండు రోజుల్లో రైతుల ఫోన్లకు రుణమాఫీ మెస్సేజులు వస్తాయన్న మర్రి

Shekhar G
Published on: 13 Aug 2023 9:27 AM IST
Sale Of Kokapet Land For Loan Waiver Of Farmers Says Marri Janardhan Reddy
X

Marri Janardhan Reddy: రైతుల రుణమాఫీ కోసమే కోకాపేట భూముల అమ్మకం

Marri Janardhan Reddy: నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణ అనుమతులు రావడంపై సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతగా బిజినపల్లి మండలం వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ ఆనకట్టపై ఆయన అభినందన సభ నిర్వహించారు. సభలో మాట్లాడిన మర్రి..రైతు రుణమాఫీ చేసేందుకే సీఎం కేసీఆర్‌ కోకాపేట భూములను అమ్మారని వ్యాఖ్యానించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తామన్న దింపుడు కల్లం ఆశలు ఆవిరవుతున్నాయన్నారు. మరో రెండు రోజుల్లోనే రైతుల ఫోన్లో రుణమాఫికి సంబంధించిన మెస్సేజులు వస్తాయని మర్రి జనార్థన్‌రెడ్డి అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story