Warangal: మెడికో ప్రీతి మృతి కేసులో సైఫ్‌కు బెయిల్

Warangal: సైఫ్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు

Jyothi
Published on: 20 April 2023 7:30 AM IST
Saif Granted Bail in Medico Preeti Death Case
X

Warangal: మెడికో ప్రీతి మృతి కేసులో సైఫ్‌కు బెయిల్

Warangal: వరంగల్‌లో మెడికో ప్రీతి మృతి కేసులో నిందితుడు సైఫ్‌కు బెయిల్ మంజూరైంది. సైఫ్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. రూ.10 వేల బాండ్, ఇద్దరి పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది. అయితే ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని కోర్టు షరతు విధించింది. నేడు ఖమ్మం జైలు నుంచి సైఫ్ విడుదల కానున్నాడు.

మరోవైపు ప్రీతి మృతి కేసులో దర్యాప్తు తీరు సరిగాలేదన్నారు ప్రీతి సోదరుడు పృథ్వీ. తమకు ఇప్పటివరకు పోస్టుమార్టం రిపోర్టు ఇవ్వలేదన్నారు. రిపోర్టు ఆలస్యమవడానికి కారణాలేంటని ప్రశ్నించారు. హెచ్ఓడీ, ప్రిన్సిపల్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదంటున్నారు. సీపీపై తమకు నమ్మకం ఉందని.. సరిగా దర్యాప్తు చేయాలని కోరారు.

Jyothi

Jyothi

Next Story