Nalgonda: అమెరికాలో నల్గొండ వాసి దారుణహత్య

Nalgonda: మేరీలాండ్‌లో ఆదివారం సాయంత్రం కాల్పులు

Rama Rao
Updated on: 22 Jun 2022 5:04 PM IST
Sai Charan of Nalgonda was Killed in a Shooting in Maryland
X

Nalgonda: అమెరికాలో నల్గొండ వాసి దారుణహత్య

Nalgonda: అమెరికాలోని మేరీలాండ్‌లో నల్లగొండకు చెందిన యువకుడిని దుండగులు కాల్చిచంపారు. కాల్పుల్లో నల్గొండకు నక్కా సాయిచరణ్ మృతిచెందారు. సాయి చరణ్‌ గత రెండేండ్లుగా మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్‌‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. అయితే ఆదివారం సాయంత్రం తన మిత్రుడిని కారులో విమానాశ్రయంలో వదిలి తిరిగి ఇంటికి వెళ్తుండగా అతనిపై ఓ నల్లజాతీయులు కాల్పులు జరిపారు. దీంతో సాయి చరణ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానిక అధికారులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.


Rama Rao

Rama Rao

Next Story