Sadar Utsavalu 2021 - Hyderabad: భాగ్యనగరంలో ఈనెల 5న సదర్ ఉత్సవాలు

Sadar Utsavalu 2021 - Hyderabad: వేడుకల్లో విన్యాసాలు చేయనున్న లవ్ రానా, షారుక్‌ దున్నలు...

Shireesha
Updated on: 3 Nov 2021 2:17 PM IST
Sadar Utsavalu 2021 Celebrated in Hyderabad on November 5th 2021 | Hyderabad News Today
X

Sadar Utsavalu 2021 - Hyderabad: భాగ్యనగరంలో ఈనెల 5న సదర్ ఉత్సవాలు

Sadar Utsavalu 2021 - Hyderabad: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సదర్ వేడుకలకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. ఈ నెల 5న జరిగే ఈ ఉత్సవాల్లో నగరానికి చెందిన షారుక్, హర్యానాకు చెందిన లవ్ రానా అనే దున్నరాజులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని నిర్వాహకులు తెలిపారు. ఖైరతాబాద్‌కు చెందిన మధు​యాదవ్ రెండేళ్ల క్రితం హర్యానా నుంచి లవ్ రానాను కొనుగోలు చేసి తన డైరీ ఫామ్‌లో పోషిస్తున్నాడు.

ఇది నేషనల్ ఛాంపియన్‌లో గెలిచిన సుల్తాన్ రాజు దున్నకు పుట్టిన దూడ. అదే విధంగా షారుక్ అనే దున్న రాజులు సదర్ వేడుకల్లో విన్యాసాలు చేయనున్నాయి. ఇక ఖైరతాబాద్, నారాయణగూడ లలో జరిగే సదర్​వేడుకల్లో లవ్ రానా, షారుక్ దున్నరాజులు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.

Shireesha

Shireesha

Next Story