ఈనెల 25న నిజామాబాద్‌లో రైతు గర్జన సభ

Arun Chilukuri
Published on: 24 Feb 2021 5:22 PM IST
ఈనెల 25న నిజామాబాద్‌లో రైతు గర్జన సభ
X

ఈనెల 25న నిజామాబాద్‌లో రైతు గర్జన సభ

కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిజామాబాద్‌లో రైతు గర్జన సభ నిర్వహిస్తున్నట్లు అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు ప్రకటించారు. నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్‌లో ఈనెల 25న జరిగే ధర్నాకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా సినీ యాక్టర్ ఆర్ నారాయణ మూర్తి, రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వస్తున్నట్లు చెప్పారు. రైతు చట్టాలు రద్దు చేసే వరకు రైతు పక్షాన పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story