రైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..

Rythu Bandhu Amount: రేపటి నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ కానున్నాయి.

Arun Chilukuri
Updated on: 27 Jun 2022 7:13 PM IST
Rythu Bandhu Distribution From Tomorrow in Telangana
X

రైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..

Rythu Bandhu Amount: రేపటి నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ కానున్నాయి. వానాకాలం రైతుబంధు నిధుల పంపిణీకి సర్వం సిద్ధం చేశామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఈ సీజన్‌కు 68లక్షల 10 వేల మంది అర్హులుగా ఉన్నారు. కోటి 50లక్షల ఎకరాలకు 7వేల 5వందల కోట్లు పెట్టుబడి సాయంగా అందించేందుకు అధికారం యంత్రాంగం సిద్ధమైంది. దశల వారిగా రైతుబంధు డబ్బులు జమ కానున్నాయి. కాగా మొదటిసారి రైతుబంధు తీసుకునే రైతులు వెంటనే సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి పట్టాదార్ పాసుబుక్కు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు అందించి నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story