logo
తెలంగాణ

CM KCR: తెలంగాణ రైతాంగానికి గుడ్‌న్యూస్..28న రైతుల ఖాతాల్లో..

Rythu Bandhu Distribution From December 28 For Yasangi Season
X

CM KCR: తెలంగాణ రైతాంగానికి గుడ్‌న్యూస్..28న రైతుల ఖాతాల్లో..

Highlights

Rythu Bandhu: తెలంగాణ రైతాంగానికి గుడ్‌న్యూస్ చెప్పింది ప్రభుత్వం.

Rythu Bandhu: తెలంగాణ రైతాంగానికి గుడ్‌న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఈ నెల 28న రైతుబంధు నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు సీఎం కేసీఆర్. లబ్దిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. గతంలో మాదిరిగానే ప్రారంభమైన వారం, పది రోజుల్లో లబ్దిదారుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయన్నారు సీఎం కేసీఆర్.

తెలంగాణలో కరోనా పరిస్థితులపై కలెక్టర్లు, వైద్యారోగ్యశాఖ అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఒమిక్రాన్‌ ముందస్తు చర్యలపై ఆయన ఆరా తీశారు. కేసులు, వ్యాక్సినేషన్‌పై వివరాలను అడిగి తెలుసుకున్నారు సీఎం కేసీఆర్. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని సీఎం కేసీఆర్‌కు వివరించారు అధికారులు.

Web TitleRythu Bandhu Distribution From December 28 For Yasangi Season
Next Story